BREAKING
పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు

నిజాయితీతోనే సమృద్ధి...అవినీతికి చరమగీతం పాడాలి

Select Suryaa Now
నిజాయితీతోనే సమృద్ధి...అవినీతికి చరమగీతం పాడాలి

సూర్య, సెంటినరీకాలనీ :నిజాయితీతోనే సమృద్ధి...అవినీతికి చరమగీతం పాడాలని ఆర్జీ-3 ఏరియా  ఇంచార్జి జనరల్‌ మేనేజర్‌ మొలుగూరి రామ్మోహన్‌, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా  ఇంచార్జి  జనరల్‌ మేనేజర్‌ బండి సత్యనారాయణ అన్నారు.  సింగరేణి సంస్థలో అవినీతిని అరికట్టి, పారదర్శకతతో కూడిన పాలనను ప్రోత్సహించడమే లక్ష్యంగా విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలను సోమవారం ఆర్‌జీ-3 ఏరియా జీఎం కార్యాలయంలో ప్రారంభించారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాలను ఆర్‌జీ-3 ఏరియా ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ ఎం.రామ్మోహన్‌, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ బండి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేయించి, అవగాహన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ‘నిజాయితీతో సమృద్ధి’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో ప్రతి ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని అధికారులు సూచించారు. అవినీతి వ్యతిరేక ప్రచారానికి సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని, సంస్థకు నష్టం కలిగించే ఘటనలను అరికట్టడంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉద్యోగుల్లో బాధ్యతాయుతమైన పని సంస్కృతిని పెంపొందించడంతో పాటు అక్రమాలకు తావులేకుండా చూడటంలో విజిలెన్స్‌ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, స్వార్ధ రహితంగా పని చేయాలని పిలుపునిచ్చారు. వారోత్సవాల్లో భాగంగా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్‌జీ-3, ఏపీఏ ఏరియాల్లోని అన్ని గనులు, విభాగాల్లోనూ విజిలెన్స్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు జి.రాజేందర్‌, కోట రవీందర్‌రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్‌, ఏరియా ఇంజనీర్‌ ఎ.ఉదయభాస్కర్‌, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ జి.లక్ష్మీనారాయణ, ఐఈ డీజీఎం బి.టి.మురళీకృష్ణ, ఇన్‌చార్జి పర్సనల్‌ విభాగాధిపతి ఎన్‌.వంశీధర్‌, పర్యావరణ అధికారి ప్రశాంత్‌ జీవన్‌, సీనియర్‌ పీఓ పి.రాజేశం, ఇతర అధికారులు, జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.