BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026

Select Suryaa Now
పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు, ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు. నేడు జిల్లాలోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు చేపట్టి, సరైన ధ్రువపత్రాలు లేని 40కి పైగా వాహనాలను సీజ్ చేశారు.   8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తూ, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు.    ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న ట్రబుల్ మాంగర్స్‌పై ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 1,856 మందిని బైండోవర్ చేయడం జరిగింది.  అక్రమ మద్యం విక్రయాలు, రవాణా, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను అరికట్టేందుకు చేపట్టిన తనిఖీల్లో 57 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.   ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, అక్రమ కార్యకలాపాలు, ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారు.    ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.