సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ!
కొండాపూర్;కొండాపూర్ మండలంలో అధికారుల లేక పనులు ముందుకుసాగడం లేదు అనే అంశంపై ఈ నెల 7న సూర్య దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. మండలానికి నూతన ఎంపీఓగా కె. యాదగిరిని నియమించగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఎంపీఓ నియామకంతో పంచాయతీ పనులు వేగవంతమవుతాయని ఆశిస్తున్నారు. , మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ పోస్టు ఇప్పటికీ ఖాళీగానే ఉండటంతో ఆ పోస్టును వెంటనే భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.