జోరు పెంచిన రాజారెడ్డి ప్రచారం.. -58వ డివిజన్లో ప్రజలు అడుగడుగున నిరాజనం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ ; గెలుపే లక్ష్యంగా 58వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి తన ప్రచారాన్ని జోరును మరింత పెంచారు. సోమవారం చింతల శీను ప్రాంతంలో కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారానికి వెళ్లిన రాజారెడ్డికి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. ఈ సందర్భంగా రాజారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అవసరమైన అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని, 24 గంటలు డివిజన్లో ప్రజలకు రక్షణగా నిలవడమేతన బాధ్యతని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మీలో ఒకడిగా ఉంటాను రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి మేయర్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, తనకు గాజు గ్లాసు పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అవార్డు అధ్యక్షులు రమేష్ రెడ్డి, బాబ్జి రాజేష్ యాదవ్, నాగరాజు, జనసైనికులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్