BREAKING
ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టాలి

దోమ ప్రజావాణికి నాలుగు దరఖాస్తులే

Select Suryaa Now
దోమ ప్రజావాణికి నాలుగు దరఖాస్తులే
దోమ, మేజర్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. సోమవారం దోమ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు కేవలం నాలుగు దరఖాస్తులు మాత్రమే సమర్పించారు. దీంతో ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగా సాగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వాటి పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణికి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంపై చర్చ జరుగుతోంది. గ్రామాల్లో కార్యక్రమంపై ముందస్తు ప్రచారం నిర్వహించకపోవడం, గతంలో సమర్పించిన అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటమే ప్రజల నిరాసక్తతకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ప్రజావాణిలో ఇచ్చిన అర్జీలపై సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఈ కార్యక్రమంపై నమ్మకం తగ్గే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజావాణి నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని కోరుతున్నారు. గతంలో వచ్చిన దరఖాస్తుల పురోగతిని సమీక్షించడంతోపాటు, కార్యక్రమానికి హాజరుకాని అధికారుల విషయంలో ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.