BREAKING
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం

పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటును నమోదు చేసుకోవాలి

Select Suryaa Now
పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటును నమోదు చేసుకోవాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత దరఖాస్తు ఫారాలను సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఫారం-19లను జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు తహసీల్దార్లు, మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓలు ఎంపీడీఓలు సంబంధిత ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి, అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ఓటరు నమోదు విధానం, అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు సమర్పణపై అవగాహన కల్పించాలని సూచించారు.ప్రతి అర్హుడికి ఓటరు నమోదు ప్రక్రియపై సమాచారం చేరేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.