వైసిపి ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి టిడిపిలోకి చేరిక…
వైసిపి ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి టిడిపిలోకి చేరిక…
పార్టీ కండువాతో పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ!!
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రామగిరి మండలంలోని ఎగువపల్లికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి సోమవారం ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ లోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ చిగిచెర్ల రవికి పార్టీ కండువాని కప్పి టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వైసిపిని వీడి టిడిపిలోకి చేరినట్టు చిగిచెర్ల రవి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు రామూర్తి నాయుడు టిడిపి యువ నాయకుడు శ్రీధర్ నాయుడు, శిరీష నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.