BREAKING
ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి..

అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డుతో చెల్లుబోయిన శ్రీనివాసరావుకు ఘన సత్కారం

Select Suryaa Now
అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డుతో చెల్లుబోయిన శ్రీనివాసరావుకు ఘన సత్కారం

                                                   హైదరాబాద్‌లో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కడియం, మేజర్ న్యూస్,:కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, టీడీపీ జోన్‌-2 కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాసరావుకు డా. ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఆదివారం యువ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులు, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నవారు, సంఘసేవకులను గుర్తించి ఈ అవార్డులను అందజేశారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాల చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి జేఏసీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఏపీ రాష్ట్ర ఛైర్మన్ కేతా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, అబ్దుల్ కలాం నిజాయితీ, నిరాడంబరత, దేశసేవకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి యువతకు, ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్న యువ ఆర్ట్స్ థియేటర్స్ అధినేత డా. బి.ఆర్. వెంకటరమణ సేవలను ప్రశంసించారు.
శ్రీనివాసరావుకు ఈ అవార్డు లభించడంపై పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.