కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధి --జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఉన్న మట్ల ఎలిజా
ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వా ల్సిన అవసరం ఉందని ,అందుకోసం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధిని సాధించుకోవాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్రావు నగర ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఏలూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవ సరం ఉందని తెలిపారు. ఏలూరు నగర మేయర్ అభ్యర్థి బురదగుంట లివిన్ క్రిస్టియన్ ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని,
అందుకు అనుకూలంగా నగర ప్రజలు నగర అభివృద్ధి కోసం యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు. చింతలపూడి మాజీ శాస నసభ్యులు ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ దేశంలో మార్పు మొదలైందని, ఆ మార్పు లో భాగంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమాజంలో జరిగే అవినీతిని అంతమొందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏలూరు నగర మేయర్ అభ్యర్థి క్రిస్టియన్ మాట్లాడుతూ దేశవ్యా ప్తంగా మార్పు ఏర్పడిందని, అందుకు అనుగుణంగా ఏలూరు నగర అభివృద్ధికి స్వచ్ఛమైన త్రాగునీరు, శానిటేషన్, విశాలమైన రహదారులు, వీధిలైట్లు, అన్ని డివిజన్ లలో ఏ ఒక్కరూ అనారోగ్యానికి గురికాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాట్లకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ దండు బోయిన చంద్రశేఖర్,
నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి సుబ్రమణ్య శర్మ మరియు సాదే బాబు ప్రసాద్, కౌలూరి చంద్రశేఖర్, కొణిజేటి రమాదేవి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.