జాతీయ స్థాయి గణిత ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ.. 18 మంది విద్యార్థులకు ప్రాంతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- జాతీయ స్థాయిలో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్ష–2026 తొలి దశలో శ్రీ చైతన్య విద్యాసంస్థల అనంతపురం ప్రాంగణం–5 ఐపీఎల్, సహ ఐపీఎల్ విభాగాలకు చెందిన 18 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరంతా నవంబర్‌లో జరగనున్న ప్రాంతీయ గణిత ప్రతిభా పరీక్షకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభకు శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి విద్యాసంస్థకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల నిరంతర కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, యాజమాన్యం అందించిన సహకారం ప్రధాన కారణాలని పాఠశాల ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సమీన ఖాన్, ప్రధానోపాధ్యాయులు నరేష్ కుమార్, విశ్వనాథ్, ఉప ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, సమన్వయకర్త రాధాకృష్ణ నాయుడు, ఐపీఎల్, సహ ఐపీఎల్ విభాగాల బాధ్యులు జయచంద్ర, శ్రీనివాస్ పట్నాయక్, పరిపాలన అధికారులు హరినాథ్ రెడ్డి, నాగరాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్