BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలేవి.?: టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి

Select Suryaa Now
విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలేవి.?: టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి
వికారాబాద్, మేజర్ న్యూస్: విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన వికారాబాద్ మండల విద్యాధికారి (ఎంఈఓ), జిల్లా విద్యాధికారి (డీఈఓ)లను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్‌వీ) వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ను కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. దసరా సెలవుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు దీపక్ రెడ్డి తెలిపారు.అయినప్పటికీ, ఫిర్యాదులపై అధికారులు స్పందించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని, నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులను పరిశీలించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దీపక్ రెడ్డి కోరారు. లేనిపక్షంలో టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.