ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి.
ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ సీటు బీసీకి రిజర్వ్ అయినప్పటికీ, బి. సీ ల్లో భాగమైన బీసీ (సీ ) క్రైస్తవ అభ్యర్థులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో తాను ఇండిపెండెంట్ అభ్యర్థినిగా, మేయర్ సీటుకు పోటీ చేస్తున్నానని నగర అభివృద్ధికి తనను గెలిపించాలని పెరికె దీనాగ్లాడి అన్నారు. సోమవారం స్థానిక లంకపేటలోనందు తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దీనా గ్లాడి మాట్లాడుతూ, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ టీం బలపరిచిన నన్ను ఆశీర్వదించాలని కోరారు. కేవలం బీసీలను గుర్తించకపోవడంపై తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అత్యధిక మెజార్టీతో ఏలూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని దీనా గ్లాడి ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గతం లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులైన వేలాదిమంది యువతి యువకులకు వివిధ రకాల శిక్షణ లు అందించి, వారి ఉపాధికి బాటలు వేశానన్నారు. అలాగే కరోనా సమయంలో నగరమంతా పెరికే ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో గుర్తింపు పొందానన్నారు. నగరంలో నెలకొని ఉన్న దీర్ఘకాలిక సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, వాటన్నిటిని దశలవారీగా పరిష్కరించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విధంగా నగరాన్ని గ్రీన్ సిటీగా మార్పు చేస్తానన్నారు. నగరంలో త్రాగునీటి కొరతకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయని, ఈ సమస్యకు పూర్తి పరిష్కారం తాను చూపిస్తాను అన్నారు. ఏలూరు క్రిస్టియన్ జాయింట్ ఆక్షన్ టీం వ్యవస్థాపకులు బిషప్ కారు పాటి శాంతి సాగర్ మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్త, సేవా తత్పరత కలిగిన ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి అయిన పెరిక దిన గ్లాడిని గెలిపించాలని కోరారు. మరో ముఖ్య అతిథి మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్,ఏ.వి.పటేల్ మాట్లాడుతూ, ఎస్సీ, బీసీ మైనార్టీలు, మాదిగ క్రైస్తవులు అంతా, ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థిని గెలిపించాలని హితవు పలికారు. టిడిపి వైఎస్ఆర్సిపి పార్టీలు దళిత ఓట్లు, దళిత క్రిస్టియన్ ఓట్లు, తమ పార్టీకి అవసరంలేదని గతంలో వ్యాఖ్యానించారని కాబట్టి, ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఆలిండియా దళిత క్రిస్టియన్ రైట్స్ వ్యవస్థాపకులు పెరికే వరప్రసాద్ మాజీ మున్సిపల్ ఆర్ జె డి, డాక్టర్ వి రాజేంద్రప్రసాద్, సేవకులు రెవరెండ్ బీరపోగు యోహాన్, తేళ్ల శ్యాంబాబు, పాస్టర్ పివి రాజు బేతేలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.