andhrapradesh
అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్
తవణంపల్లి, మేజర్ న్యూస్:; శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు ప్రత్యేక అభిషేకములు, 11 గంటలకు సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ ఏ. రఘుపతి, ఆలయ ఈఓ ఈ. మునిశేఖర్ తీర్థప్రసాదాలు అందజేశారు. పౌర్ణమి సందర్భంగా ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
చిత్తూరు రిపోర్టర్ అజయ్ కుమార్