కాజిపల్లికి హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలి
జీన్నారం;గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజిపల్లి గ్రామ ప్రజలకు హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ఆర్కే ఫౌండేషన్ చైర్మన్, అడ్వకేట్ దండే రమాకాంత్ కోరారు. ఈ మేరకు సోమవారం జిన్నారం మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డికి ప్రజావాణిలో ఫిర్యాదు అందజేశారు. అనంతరం గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ పి.తాన్యా తో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా కాజిపల్లికి వాటర్ అందించేలా చర్యలు తీసుకోవాలని చర్చించారు.... గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా నీటిని అందించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో ఈ అంశంపై అఖిలపక్ష నాయకులు ,అధికారులతో సమావేశాన్ని నిర్వహించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో వావిలాల మాజీ సర్పంచ్ రవీందర్, కార్యాలయ సిబ్బంది, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.