53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- అనంతపురం నగరంలోని 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి, జనసేన యువ నాయకుడు కోలా తేజస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. యువ నాయకుడికి ప్రజలు నీరాజనాలు పలుకుతూ తమ మద్దతు ప్రకటించారు.
పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత అనే లక్ష్యంతో తేజస్ ముందుకు సాగుతున్నారు. బడుగు, బలహీన వర్గాలను కలుపుకొని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, యువతను భాగస్వాములుగా చేసుకొని డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకుడు ఓంకార్, జనసేన నాయకులు అంగడి చలపతి, సురేష్, కాయగూర లక్ష్మీప్రసాద్, రాయచూరు జగదీష్, ఆరిఫ్, కిషోర్, జగదీష్, మధుతో పాటు పలువురు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..