*నిరుపేద కుటుంబాలకు దాతలు అండగా నిలవాలి*
మునిపల్లి;సోమవారం మండల కేంద్రమైన మునిపల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థికి దాత (యన్ గార్డెన్) ఫంక్షన్ హాల్ ఓనర్ నాజీర్ రూ.11,000ల ఆర్థిక సాయం అందించిన్నట్లు తహసీల్దార్ తెలిపారు.ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ మండలంలోని పెద్దాలోడి గ్రామానికి చెందిన మన్నె లహరిక ఓ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ప్రభుత్వ పాఠశాల, గురుకుల పాఠశాలలో చదువుకొని వికారాబాద్ మెడికల్ కాలేజీలో సీట్ సాధించినందుకు మండలంలోని తక్కడపల్లి గ్రామానికి చెందిన నజీర్ ఎన్ గార్డెన్ వ్యాపారవేత అందించిన ఆర్థిక సహాయం తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రంగారావు లహరికకు అందించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పేదరికం లెక్కచేయకుండా పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలన్నా దృడ సంకల్పంతో ముందుకు సాగుతున్న లహరికకు దాతలు ముందుకు వచ్చి మరింత సహాయం అందించాలన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో గల ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థిని,విద్యార్థులు లహరికను ఆదర్శంగా తీసుకొని విద్యారంగంలో రాణించాలని సూచించారు.
-----