BREAKING
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ ఎంపీటీసీలకు బి-ఫారాల అందజేత... చింతలూరు నూకాలమ్మకు సప్త నది జలాలతో అభిషేకం మరోసారి అధికారం కోసమే బీజేపీ ఓట్ల తొలగింపు నాటకం -- సర్ ప్రక్రియ కొత్తేమీ కాదు.. ఈ సరే ప్రత్యేకం -- పేదోడి ఓటును కాపాడితేనే రాజ్యాంగ పరిరక్షణ -- నవంబర్‌ 1న ఛలో ఢిల్లీకి తరలిరావాలి -- ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభను విజయవంతం చేద్దాం -- పట్టభద్రుల ఎమ్మెల్సీగా సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి -- మంత్ర పినపల్లో టిడిపి జోరు ఇంట్లోకి చొరబడి దాడి... ముగ్గురు నిందితులకు రిమాండ్ జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్

Select Suryaa Now
పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్

ఉండి, మేజర్ న్యూస్:పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు, పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పెదపుల్లేరు గ్రామంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. పెదపుల్లేరు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ ప్రధమ సంవత్సర విద్యార్థిని కుమారి జోష్న లక్ష్మీప్రియ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయే పరిస్థితి ఉందని తెలుసుకున్న లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు లయన్ గొట్టుముక్కల రాము, లయన్ శైలజ దంపతులు తక్షణమే స్పందించారు. తమ వంతు సహాయంగా రూ. 10,000/- ఆర్థిక సహాయాన్ని క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణరెడ్డి చేతుల మీదుగా ఆ విద్యార్థినికి అందజేశారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణరెడ్డి మాట్లాడుతూ సమాజంలో విద్యాభివృద్ధికి తోడ్పడేందుకు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారని, విద్యార్థులు ఆ సహకారాన్ని అందిపుచ్చుకుని ఆత్మవిశ్వాసంతో చదువు ముందుకు కొనసాగాలన్నారు. లయన్స్ క్లబ్ ఈ ఏడాది విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సహాయం అందిస్తోందని చెపుతూ, ఉదారంగా స్పందించిన దాతలు రాము, శైలజ దంపతులను అభినందించారు.

క్లబ్ కార్యదర్శి రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ ఒక కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుపడుతుందన్నారు. విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా, మొత్తం సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని, ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమేనని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో రీజియన్ కార్యదర్శి సత్తి బ్రహ్మారెడ్డి, క్లబ్ మాజీ అధ్యక్షులు పాలతీర్ధపు నరసింగరావు, భూపతిరాజు హరనాథ రాజు, కలిదిండి సీతారామరాజు, కలిదిండి పెద అప్పలరాజు,  తదితరులు పాల్గొన్నారు.