BREAKING
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం

అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

Select Suryaa Now
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

రామచంద్రపురం మేజర్ న్యూస్, బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. తుపాను ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు నివారించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను నిరంతరం గమనిస్తూ, అధికారిక సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.

తుపాను ప్రభావం తగ్గే వరకు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండరాదని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల వల్ల రహదారులపై నీరు నిలిచే ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు :తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, వైద్య, ఇతర సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా సిబ్బంది, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. తుపాను తీవ్రతను బట్టి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
తుపాను సమయంలో అత్యవసర సహాయం, సమాచారం కోసం ప్రజలు కింది నంబర్లను సంప్రదించవచ్చు.

కోనసీమ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08865-293104
అమలాపురం ఆర్డీఓ కార్యాలయం: 08856-233208

రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం: 08857-245166

కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం:
9989855444

తుపాను పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. ప్రజలు అధికారులకు సహకరిస్తూ, తమ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం, అక్టోబర్ 27, 28 తేదీల్లో కోనసీమ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయని మంత్రి వెల్లడించారు.