వైసీపీ ఎంపీటీసీలకు బి-ఫారాల అందజేత...
ఆనందపురం:26అక్టోబర్ మేజర్ న్యూస్.
ఆనందపురం మండలంలో రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులకు పార్టీ బి-ఫారాలను అందజేశారు. ఎంపీపీ అభ్యర్థి గండ్రేటి శ్రీనుతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు మాజీ జడ్పీటీసీ కోరాడ వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యం, జెడ్పీటీసీ అభ్యర్థి మజ్జి వెంకట్రావు చేతుల మీదుగా బి-ఫారాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభ్యర్థులకు బి-ఫారాలను అందజేసి, ఎన్నికల ప్రక్రియలో తదుపరి కార్యక్రమాలకు సిద్ధం కావాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల వివరాలు
1. ఆనందపురం–1: సెనగం సుగుణ
2. ఆనందపురం–2: చందక మణి
3. బోని..బోని అప్పలనాయుడు
4. చందక: దవల ప్రియాంక
5. గంభీరం: అయినపరపు వెంకట్ కుమార్
6. గిడిజాల: పాండ్రంకి చంద్రకళ
7. గొట్టిపల్లి: ఇల్లపు అప్పియమ్మ
8. కణమాం: చవితిన నాగమణి
9. కుశలవాడ: సెనగం అప్పల వెంకట సదాశివ ప్రసాద్ రావు
10. మామిడిలోవ: గండ్రేటి శ్రీనివాసరావు
11. ముచ్చర్ల: పాండ్రంకి రామయ్యమ్మ
12. పాలవలస: లొడగల అప్పలనాయుడు
13. పెద్దిపాలెం: అముజోరే నర్సింగరావు
14. సొంటియం: గొలగాన రవికుమార్
15. తర్లువాడ: కొండ్రు అప్పలరాజు
16. వెల్లంకి: తోనంగి సత్యవేణి, పడాల గీతిక
17. వేములవలస: బంటపల్లి అలేఖ్య
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు బి-ఫారాలను స్వీకరించడంతో మండలంలో ఎన్నికల కార్యకలాపాలు మరింత ఊపందుకున్నాయి.