చింతలూరు నూకాలమ్మకు సప్త నది జలాలతో అభిషేకం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఉభయగోదావరి జిల్లాల్లో పేరుగాంచిన ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసున్న శ్రీ నూకంబిక అమ్మవారి కి పౌర్ణమి పురస్కరించుకొని సప్తనదీజలాలతో అత్యంత వైభవంగా జల అభిషేకం జరిగినది. ప్రతి నెల పౌర్ణమి రోజున సప్త నది జలాలతో అమ్మవారికి జలాభిషేకం లో భాగంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క నది జలముతో భాగంగా ఈరోజు శ్రీశైలం పాతాళ గంగ నదీ జలములతో ఎంతో వైభవముగా వేదమంత్రోత్సవాల మధ్య ప్రత్యేక హారతి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ఉండవెల్లి వీర్రాజు చౌదరి చైర్మన్ వీరీ అప్పారావు గౌడ్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు మాజీ చైర్మన్ అల్లంరాజు రామకృష్ణమూర్తి అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.