BREAKING
జాతీయ స్థాయి మల్లకంభ పోటీలకు విజ్ఞాన విహార విద్యార్థులు ప్రజలు తమ ఓటుతో మంచికి పట్టం కట్టాలి -- ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తుఫాన్‌ హెచ్చరికలతో అధికారుల అప్రమత్తం మహిళ కన్నీటికి చలించిన ఎమ్మెల్యే చింతమనేని -- అట్లతద్ది వాయినాల సరుకుల కోసం తెచ్చుకున్న రూ. 20 వేలు పోగొట్టుకున్న ఆమెకు కొండంత అండ 92వ వార్డు సమగ్రాభివృద్ధే ధ్యేయం: స్వతంత్ర అభ్యర్థి లీలాదేవి కొనుగోలుదారులతో కిటకిటలాడిన పూర్ణ మార్కెట్ 5వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం..:విత్తనాల మూర్తికి మద్దతుగా పినిపే శ్రీకాంత్, ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఏడువాక శ్రీమహాలక్ష్మి విజయం ఖాయం డ్రైనేజీలను పరిశుభ్రం చేస్తున్న సిబ్బంది 15వ వార్డులో వైసీపీ అభ్యర్థిని సంసాని శ్యామలాదేవి ప్రచార జోరు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం నేటి నుంచే ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర 62వార్డులో ఎన్నికల ప్రచారం హోరు సర్వోదయ శిక్షణతో ప్రజాసేవకు కొత్త స్ఫూర్తి రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :మంత్రి సుభాష్

జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్!

Select Suryaa Now
జేగురుపాడులో టీడీపీకి షాక్‌..  వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్!

                             మూడు దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేసిన దళిత నాయకుడు.. అనుచరులతో వైసీపీ తీర్థం

కడియం, మేజర్ న్యూస్ ,కడియం మండలం జేగురుపాడు గ్రామ తెలుగుదేశం పార్టీలో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేసిన దళిత నాయకుడు చికిలే కిషోర్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక టీడీపీ నాయకత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై, వారి సంకుచిత అభిప్రాయాలపై విభేదించిన ఆయన.. సోమవారం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేసిన కీలక నాయకుడు పార్టీని వీడి వైసీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో జేగురుపాడులో వైసీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం లభించింది.
ఈ కార్యక్రమంలో ఫిషర్‌మెన్ సొసైటీ అధ్యక్షుడు శాకా కిరణ్, మాజీ అధ్యక్షుడు బళ్ల అన్నవరం, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు మద్దుకూరి గోపి, మద్దుకూరి పుల్లయ్య, వరసాల నాని, మోటుక మునియ్య, రాయి మోహన్, మద్దుకూరి శ్రీను, వరసాల చంటి, బాణాల నాని, గుత్తాల వెంకట్రావుతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.