జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. :
జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి.
జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను సోమవారం నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, శారీరక దృఢత్వాన్ని అభివృద్ధి చేయడం, వారి ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా పోటీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పిస్తూ, క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఎఫ్‌ఏఓ సిద్ధ పద్మ, జిల్లా విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రాథోడ్ లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐఈఆర్‌పీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.