కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడియద్ద గ్రామంలో తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి, ఎన్నికల నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి వివాదాలు, ఘర్షణలు, ప్రలోభాలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు, సమస్యాత్మక పరిస్థితులపై గ్రామ పెద్దలు మరియు ప్రజలతో చర్చించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రిపోర్టర్ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా