BREAKING
వైసిపి ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి టిడిపిలోకి చేరిక… భోగి సినిమా కోసం డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్.. శర్వానంద్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఓం మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి.. నిత్యారెడ్డి పాత్రతో అదరగొట్టనున్న టాలెంటెడ్ బ్యూటీ పోస్టర్‌పై పెద్ద ఫోటో ఉంటేనే సక్సెస్ అనుకోవడం చిన్న మనస్తత్వమే.. నటి రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ శివానంద్ ను పరామర్శించిన మాధవ రెడ్డి! జాతీయ స్థాయి గణిత ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ.. 18 మంది విద్యార్థులకు ప్రాంతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత జోరు పెంచిన రాజారెడ్డి ప్రచారం.. -58వ డివిజన్లో ప్రజలు అడుగడుగున నిరాజనం 7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే

నైతిక విలువల పెంపునకు పరివర్తన్ 28న

Select Suryaa Now
నైతిక విలువల పెంపునకు పరివర్తన్ 28న

పటాన్ చెరు;విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా ఈనెల 28న పరివర్తన్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు పటాన్ చెరు జోన్ ఇంచార్జ్, ట్రస్మా  జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రమోద్ కుమార్, సంజీవ్ రావు,గీత శేఖర్, సతీష్, నగేష్,వాసు,సదాశివ రావు, ట్రస్మా  రాష్ట్ర అడ్వైజర్ పూసల లింగాగౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, జిల్లా సెక్రటరీ ఆంథోనీ రెడ్డి, ట్రెజరర్ డి.నాగేశ్వర్ లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలాస్, విద్యాభారతి కార్యనిర్వాహక కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, ఐఎంసిటిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి హాజరవుతారన్నారు. పటాన్ చెరులో వారు మాట్లాడుతూ.. నైతిక విద్యా బోధనలతో విద్యార్థుల్లో మార్పునకు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. తరగతి గదిలోనే రోజువారి బోధనలో భాగంగా విలువలను విద్యార్థులకు అందించడం, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా వారి ఆలోచన విధానం, పరివర్తనలో సానుకూల మార్పు తీసుకురావడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు అని తెలిపారు. విలువల ఆధారిత విద్యకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను ఆవిష్కరించనున్నారని తెలిపారు. పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు.