BREAKING
ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం కాజిపల్లికి హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలి ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత ఆస్పత్రిలో కమెడియన్ అలీ భార్య.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై వస్తున్న నిజాలు ఇవే ఎన్నికల విధులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు

తాత, తండ్రి వారసత్వం

Select Suryaa Now
తాత, తండ్రి వారసత్వం

తాత, తండ్రి వారసత్వం 
--ఆత్మకూరు అభివృద్ధిలక్ష్యం
--తల్లితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన యువ నేత తారక్ రెడ్డి 
ఆత్మకూరు,సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్: ఆత్మకూరు నియోజకవర్గంలో, ఆత్మకూరు పట్టణంలో తమ తాత, తండ్రి ప్రజలకు అందించిన వైద్య సేవలు, సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు, కల్పించిన మౌలికవసతులు తదితరాలతో వారి రాజకీయ వారసత్వంగా ఆత్మకూరు అభివృద్ధి, ప్రజాసేవ పరమావధిగా తన తల్లి డాక్టర్ షకీలా తో పాటు రాజకీయ రంగ ప్రవేశం చేసిన యువ నేత బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బొమ్మిరెడ్డి వంశ యువ కెరటం బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి తొలి ప్రయత్నం లోనే అశేష ప్రజాదరణ పొందుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి మూడు దఫాలు శాసనసభ్యులుగా ఉన్న ఆత్మకూరు పట్టణంలో బిఎస్సార్ హాస్పిటల్  నిర్వహిస్తున్న డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి వైద్య సేవలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆత్మకూరులో నిర్వహించారు. ఆయన కుమారుడు డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడంతోపాటు ఆత్మకూరు మండలాధ్యక్షుడుగా, ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా, జిల్లా టెలికాం సలహా మండల సభ్యులుగా, ఆత్మకూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు విశేష సేవలు అందించారు.వారి వారసత్వంగా వారిలాగే తమ వంతు సేవలు అందించాలన్న సంకల్పం, అనాదిగా ఆదరిస్తున్న ఆత్మకూరును అభివృద్ధి పరచాలన్న లక్ష్యం, అనాదిగా అండగా ఉన్న ఆత్మకూరు ప్రజలకు సేవలు అందించాలన్న ధ్యేయంతో డాక్టర్ సుందర్ రామిరెడ్డి మనుమడు డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి అనూహ్యంగా తన తల్లి బి ఎస్ ఆర్ హాస్పిటల్ నిర్వాహకురాలు వైద్య నిపుణులు డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తో కలిసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆత్మకూరు నియోజకవర్గంలో నాడు నేడు అనూహ్యంగా అభివృద్ధి పరిచిన పరుస్తున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆయన ఆహ్వానంతో బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి, డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా లు రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం తరఫున డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పోటీ చేస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతోనే డాక్టర్ షకీలాకు ఆమె తనయుడు తారక్నాథరెడ్డికి మున్సిపల్ పరిధిలో అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఎన్నికల్లో విజయం సాధించే చే పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అటు మంత్రి ఆనం చేస్తున్న అభివృద్ధి,ఇటు బొమ్మిరెడ్డి కుటుంబంలో అందించిన వైద్య సేవలు అందిస్తున్న సేవలు గతంలో చేసిన అభివృద్ధి పనులు వారికి కలిసొచ్చిన అంశాలుగా ఆత్మకూరు ప్రజలు విశేషంగా ఆదరించి ఆశీర్వదించి అభిమానిస్తున్నారు. డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా చైర్పర్సన్ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీలో ఉంటూ అన్ని వార్డుల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ అన్ని వర్గాల ఆదరణ పొందుతూ విజయ పదం వైపు దూసుకెళ్తున్నారు. కాగా తారక్ నాథ్ రెడ్డి అనాదిగా అందిస్తున్న సామాజిక సేవలు, తమ తాత, తండ్రి అందించిన సేవలు అన్ని వర్గాల ప్రజలతో ఉంటున్న మమేక విధానం ఆయనకు నేడు అత్యంత ప్రజాదరణ లభించే పరిస్థితి ఏర్పడింది. ఆత్మకూరులో అనూహ్యంగా అభివృద్ధి చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీని అనూహ్యంగా అభివృద్ధి పరిచి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మార్పించాలని, ప్రజల అవసరాలను తీర్చాలని, ప్రజా సమస్యల పరిష్కరించాలని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలన్న సంకల్పంతో ఉన్నామని అందుకే రాజకీయ రంగ ప్రవేశం చేశామని డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి పేర్కొంటున్నారు. మొత్తం మీద తొలి రాజకీయ రంగ ప్రవేశం చేసిన డాక్టర్ షకీలా రెడ్డి, బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డిలకు తొలి ప్రయత్నం లోనే విశేష ప్రజాదరణ లభిస్తుంది.