తెర్లాం లో ఘనంగా గౌరీ నందీశ్వర పూజలు
తె ర్లాం, సూర్య : గౌరీ ఉత్సవాలలో భాగంగా తె ర్లాం లో గౌరీ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీదేవిని పూజించి నందీశ్వర విగ్రహాల ప్రతిష్టించి పూజలు ఆచరించారు. పాములవలస ఆమి టి పెరుమాలి తెర్లాoలోచర్ల ఎంఆర్ అగ్రహారం తదితర గ్రామాల్లో నందీశ్వర విగ్రహాలను ప్రతిష్టించి పూజ ఆచరించారు. ఈ సందర్భంగా మహిళలు గౌరీ దేవిని పూజించి, పది రకాల పుష్పాలతో కుంకుమార్చన దీపారాధన చేసి గౌరీదేవి ఆశీర్వచనాలు అందుకున్నారు. అలాగే మండపాలు ఏర్పాటు చేసి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
రిపోర్టర్ : తిరుపతి నాయుడు, తెర్లాం, విజయనగరం జిల్లా.