BREAKING
"శనార్తి" షూటింగ్ ను సందర్శించిన సిపి ఎమ్మెల్యే సత్యం. నిజాయితీతోనే సమృద్ధి...అవినీతికి చరమగీతం పాడాలి నృసింహ క్షేత్రం నుంచి ధర్మ జాగృతి శంఖారావం! రంజీ ట్రోఫీలో చెలరేగిన ముంబై యువ ఆటగాళ్లు.. అంగక్రిష్ రఘువంశీ, ముషీర్ ఖాన్ శతకాల మోత రూ.4.82 కోట్లతో  డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు భవిత ఫిజియోథెరపిస్టులకు వేతనాలేవీ? వైసిపి ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి టిడిపిలోకి చేరిక… భోగి సినిమా కోసం డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్.. శర్వానంద్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఓం మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి.. నిత్యారెడ్డి పాత్రతో అదరగొట్టనున్న టాలెంటెడ్ బ్యూటీ పోస్టర్‌పై పెద్ద ఫోటో ఉంటేనే సక్సెస్ అనుకోవడం చిన్న మనస్తత్వమే.. నటి రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ శివానంద్ ను పరామర్శించిన మాధవ రెడ్డి! జాతీయ స్థాయి గణిత ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ.. 18 మంది విద్యార్థులకు ప్రాంతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత జోరు పెంచిన రాజారెడ్డి ప్రచారం.. -58వ డివిజన్లో ప్రజలు అడుగడుగున నిరాజనం 7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి

పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ

Select Suryaa Now
పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల.  27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ

పాలకొల్లు,మేజర్ న్యూస్: పురపాలక సంఘం చైర్‌పర్సన్, వార్డు సభ్యుల రెండో సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా 44 వార్డులకు సంబంధించి 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను సోమవారం ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ నంబరు 1199/SEC/F2/2026-1, తేదీ 22.10.2026 ప్రకారం, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భీమవరం వారి ఆమోదంతో ఈ జాబితాను విడుదల చేశారు.

పాలకొల్లు పురపాలక సంఘం పరిధిలో మొత్తం 77,478 మంది ఓటర్లు ఉండగా, వారిలో 37,191 మంది పురుషులు, 40,279 మంది మహిళలు, ఎనిమిది మంది ఇతరులు ఉన్నారు. ప్రతి వార్డుకు రెండు చొప్పున మొత్తం 88 పోలింగ్ కేంద్రాలను, 1/1 నుంచి 44/2 వరకు నంబర్లతో ప్రతిపాదించారు.

ముసాయిదా జాబితాను పాలకొల్లు పురపాలక సంఘం కార్యాలయం, అన్ని వార్డు సచివాలయాలు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం భీమవరం, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, పాలకొల్లు, యలమంచిలి మండల పరిషత్ కార్యాలయాలు, సంబంధిత మండల రెవెన్యూ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచారు. ప్రజలు కార్యాలయ పని వేళల్లో జాబితాను పరిశీలించవచ్చు.

పోలింగ్ కేంద్రాల స్థలాలు, వాటికి కేటాయించిన పోలింగ్ ప్రాంతాలపై అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే అక్టోబరు 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పాలకొల్లు పురపాలక సంఘం కమిషనర్‌కు లిఖితపూర్వకంగా సమర్పించాలని అధికారులు తెలిపారు. గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు.

ముసాయిదా జాబితాపై చర్చించేందుకు అక్టోబరు 27వ తేదీ ఉదయం 11 గంటలకు పాలకొల్లు పురపాలక సంఘం కార్యాలయ కౌన్సిల్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భీమవరం వారి ఆమోదంతో అక్టోబరు 29వ తేదీన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించనున్నారు.

ఓటర్లు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వివరాలను పరిశీలించి, అవసరమైన సూచనలు, అభ్యంతరాలను గడువులోగా సమర్పించాలని పాలకొల్లు పురపాలక సంఘం కమిషనర్ కోరారు.