BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

రూ.4.82 కోట్లతో  డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు

Select Suryaa Now
రూ.4.82 కోట్లతో  డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు


సూర్య జూలపల్లి;;పెద్దపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ జూలపల్లి మండల కేంద్రంలో రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జూలపల్లి మండల కేంద్రం వెంకటస్వామి విగ్రహం నుండి నుంచి కమ్మర్‌ఖాన్‌పేట వెళ్లే రోడ్డుకు రూ.4.82 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. అనంతరం  రేణుక ఎల్లమ్మతల్లి ఆలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

జూలపల్లి అభివృద్ధికి ప్రాధాన్యం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ జూలపల్లి మండల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇప్పటికే రూ.3 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రహరీగోడలు, మహిళా సంఘ భవనాలు, కుల సంఘ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు.హుస్సేన్ మియా వాగుపై వంతెన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. అలాగే జూలపల్లి మండల కేంద్రంలో రూ.15 కోట్లతో బీటీ డబుల్‌ రోడ్డు నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జూలపల్లి నుంచి వెంకట్రావుపల్లి వరకు రూ.32 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీ డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం 85 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాఠకుల అనూష,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు లోక జలపతి రెడ్డి, పుల్లూరి వేణుగోపాలరావు, ఉప సర్పంచ్ కొప్పులమహేష్, వార్డు సభ్యులు ఎదుల్ల కనకయ్య,అంకూస్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్మ పోచాలు, బాలరాజు పల్లి ఉపసర్పంచ్ కోరుకంటి హరికిషన్, కాంగ్రెస్‌ నాయకులు కూసుకుంట్ల రవీందర్ రెడ్డి,సిరికొండ కొమురయ్య, పొట్టల శంకరయ్య,బండి స్వామి, ఎంపీడీవో పద్మజ, ఆర్ ఐ మల్లికార్జున్ రావు, ఏఈ అన్వేష్, మహిళా సంఘాల సిఏలు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.