ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్!
ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్!
చేర్యాల యువతికి అరుదైన ఘనత.. ప్రజారోగ్య సేవే లక్ష్యమంటున్న డాక్టర్ ప్రీతి
చేర్యాల: పట్టణానికి చెందిన పోగుల ప్రీతి వైద్య విద్యలో ప్రతిభ చాటుకున్నారు. నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎండీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎంయూహెచ్‌ఎస్) ఫలితాల్లో నాలుగో ర్యాంకు సాధించారు. చేర్యాలకు చెందిన కర్రోల్ల ఎలీషా (బిడ్డ పుష్ప కుమార్తె) మనుమరాలైన ప్రీతి సాధించిన ఈ ఘనత పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతి మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన హెచ్‌ఓడీ, గైడ్, నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకులు, సీనియర్లు, జూనియర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రేమ, మద్దతు తనకు ఎంతో అండగా నిలిచాయని పేర్కొన్నారు.ప్రజారోగ్యంపై ఉన్న ఆసక్తితోనే ఈ విభాగాన్ని ఎంచుకున్నానని, నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని డాక్టర్ ప్రీతి తెలిపారు.