BREAKING
ప్రతి మహిళా సంఘ సభ్యురాలి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి నీటి బకెట్‌లో తల మునిగి మహిళ మృతి క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ యువతకు ఎంఎస్ ధోనీ కీలక సందేశం.. ముప్పై ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న మిస్టర్ కూల్ *సంగారెడ్డి పట్టణం లోని గురునానక్ మందిర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి భూముల పునఃసర్వేపై గ్రామసభ ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్! *సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే* తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ 53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం నవంబర్ 16 వరకు సాధారణ ఫీజు చెల్లింపునకు అవకాశం: జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్

Select Suryaa Now
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం  నవంబర్ 16 వరకు సాధారణ ఫీజు చెల్లింపునకు అవకాశం: జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్

నాగర్ కర్నూల్ రూరల్,సూర్య న్యూస్ : వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న 2027 పదో తరగతి వార్షిక పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్  ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రూ.125 పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థుల కోసం ఆలస్య రుసుముతో అదనపు గడువులు కల్పించినట్లు తెలిపారు.

పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు
- అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు: రూ.125 (ఆలస్య రుసుము లేదు)
- నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు: రూ.50 ఆలస్య రుసుముతో
- డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు: రూ.200 ఆలస్య రుసుముతో
- డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌ల ద్వారా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని డిఇఓ రమేష్ కుమార్ సూచించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులను గమనించి, చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరారు.