క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ
ఒంగోలు, మేజర్‌న్యూస్ :న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) 2026 కార్యక్రమం సందర్భంగా, క్యూబా జాతీయ ప్రజా అధికార సభ ఉపాధ్యక్షురాలు గౌరవనీయురాలు శ్రీమతి అనా మారియా మారి మచాడో నేతృత్వంలోని క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందం, క్యూబా రాయబారితో పాటు ఇతర పార్లమెంటు సభ్యులతో కలిసి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినారు.ఈ సందర్భంగా ఇరుపక్షాలు పరస్పర పరిచయాలు, ద్వైపాక్షిక సంబంధాలు, పార్లమెంటరీ సహకారం వంటి పలు అంశాలపై చర్చించినారు.