BREAKING
కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం

ప్రతి మహిళా సంఘ సభ్యురాలి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి

Select Suryaa Now
ప్రతి మహిళా సంఘ సభ్యురాలి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి

కంది;భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి మహిళా సంఘ సభ్యురాలు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాలని సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం) శివలక్ష్మి పిలుపునిచ్చారు. కంది మండలంలోని గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు.ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని వృథా చేయకుండా సంరక్షించుకోవాలని సూచించారు. ఇంటి ఆవరణలో, వీధి కుళాయిల వద్ద, ఇంటి పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. తద్వారా భవిష్యత్తులో తాగునీటి కొరతను కొంతవరకు నివారించవచ్చని తెలిపారు.మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించాలని కోరారు. ఒకరిని చూసి మరొకరు ముందుకు వచ్చి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అందే సహకారాన్ని సభ్యులు వినియోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు.వర్షపు నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి కుటుంబం కృషి చేయాలని ఏపీఎం శివలక్ష్మి కోరారు.