కొమురం భీమ్ ఆశయాలను కొనసాగించాలి: నైతం లక్ష్మణ్
సూర్య మంచిర్యాల టౌన్ : ఆదివాసీ పోరాటాల వీరుడు కొమురం భీమ్ 86వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివాసీ కోయ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోస్ట్‌మెట్రిక్ ఎస్టీ బాలుర వసతి గృహంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.అనంతరం కోయ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు నైతం లక్ష్మణ్ మాట్లాడుతూ,ఆదివాసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారంటే అందుకు జల్–జంగల్–జమీన్ హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటమే స్ఫూర్తి అని అన్నారు.కేవలం వర్ధంతి రోజున నివాళులర్పించడమే కాకుండా,ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఆదివాసీలంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోయ సంఘం జిల్లా అధ్యక్షుడు చెడంక మాంతయ్య, ప్రధాన కార్యదర్శి మడె సమ్మయ్య,సంయుక్త కార్యదర్శులు అర్క రాజారామ్,తలండి సత్యం, నస్పూర్ మండల అధ్యక్షుడు ఆత్రం సమ్మయ్య,ప్రధాన కార్యదర్శి ఆలం బానేష్, ప్రచార కార్యదర్శి గావిడి సమ్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.