వరిగుంతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉపేందర్
కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జోగిపేట ఉపేందర్ , ఉపాధ్యక్షుడిగా అచ్చనపల్లి శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిగా ముత్యాల భూమేష్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కార్యకర్తలందరికీ సముచిత గౌరవం కల్పిస్తూ సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ముత్యంగారి గోవర్ధన్, వార్డు సభ్యులు బోడ దాస్ గౌడ్, రమేష్, పెంట్యా, మాజీ ఎంపీటీసీ, పార్టీ సీనియర్ నాయకుడు రామకృష్ణయ్య, చంద్రశేఖర్, పెంటయ్య, మల్లేశం, కిష్టయ్యతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.