BREAKING
పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్ ఓటీటీని అలరిస్తున్న వినూత్న టైమ్ లూప్ చిత్రం ధూమకేతు.. తొలిరోజే వరుడికి ఊహించని షాక్ ఎంసీపల్లి ఎంపీటీసీగా రాధాకృష్ణ ఏకగ్రీవం!! రైతులు అప్రమత్తంగా ఉండాలి తుఫాన్ ముప్పు.. రైతుల్లో గుబులు! చేతికందే దశలో వరి పంట.. అన్నదాతల్లో ఆందోళన మాగంటి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శాసన సభ్యులు, విప్ బొలిశెట్టి అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ రామచంద్రకు అండగా నిలిచిన టాలీవుడ్ నటుడు బాబూరావు శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించండి సీఐ కాళీ చరణ్ ఉన్నత విద్యలో గుణంకాల నమోదు కీలకం -డేటా సేకరణ, సమర్పణలో సమన్వయం, ప్రామాణికతకు ప్రాధాన్యమివ్వాలి -రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ లో ఆప్సి చేర్మెన్ ప్రొఫెసర్ ఎస్.విజయ భాస్కర్ రావు అరాచక పాలనకు బుద్ధి చెప్పండి చోరీ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ - బంగారు,వెండి వస్తువులు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల విచారణ 15 రోజుల్లో పూర్తి చేస్తాం ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి టెన్నిస్ కోర్టులో అదరగొట్టిన భారత స్టార్.. కెరీర్‌లో ఐదో ఏటీపీ డబుల్స్ టైటిల్ సాధించిన యూకీ బాంబ్రీ

కూటమి సభ్యులందరినీ గెలిపించాలి --జడ్పిటిసి అభ్యర్థి చింతమనేని సాయి నవ్యశ్రీ

Select Suryaa Now
కూటమి సభ్యులందరినీ గెలిపించాలి     --జడ్పిటిసి అభ్యర్థి చింతమనేని సాయి నవ్యశ్రీ

పెదవేగి , మేజర్ న్యూస్ :పెదవేగి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి చింతమనేని సాయి నవ్యశ్రీ ఎన్నికల ప్రచారం  రెండో రోజూ  ఉత్సాహభరితంగా కొనసాగింది. సోమవారం సాయంత్రం పెదవేగి మండలంలోని రామసింగవరం, కూచింపూడి, న్యాయంపల్లి గ్రామాలలో ఆమె ప్రచార పర్యటన చేపట్టారు. స్థానిక కూటమి ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రతి గడపకూ తిరుగుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. జెడ్పీటీసీగా తనతో పాటు గ్రామాల్లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి స్థానిక సంస్థల్లో కూటమి జైత్రయాత్రను కొనసాగించాలని కోరారు.

 తమ అభిమాన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె తమ గ్రామానికి రావడంతో మహిళలు మంగళహారతులు పట్టి, గుమ్మాల వద్ద దిష్టి తీసి విజయీభవ అంటూ మనసారా ఆశీర్వదించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి, ప్రాంత సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న చింతమనేని నవ్యశ్రీకి గ్రామస్థులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొప్పనసుధ, మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, పెదవేగి సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ, సహా పలువురుటీడీపీ, జనసేన, బీజేపీ  నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇన్చార్జి ఏలూరు