ఎంసీపల్లి ఎంపీటీసీగా రాధాకృష్ణ ఏకగ్రీవం!!
ఎంసీపల్లి ఎంపీటీసీగా రాధాకృష్ణ ఏకగ్రీవం!!
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఎంసీ పల్లి పంచాయతీ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాధాకృష్ణ సోమవారం వెంకటాపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ నివాసంలో స్థానిక నాయకులతో పాటు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ అభినందనలు తెలియజేశారు. ఎంపీటీసీగా ఎన్నికైన రాధాకృష్ణ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు ఎంసీ పల్లి కార్యకర్తలు పాల్గొన్నారు