BREAKING
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ ఎంపీటీసీలకు బి-ఫారాల అందజేత... చింతలూరు నూకాలమ్మకు సప్త నది జలాలతో అభిషేకం మరోసారి అధికారం కోసమే బీజేపీ ఓట్ల తొలగింపు నాటకం -- సర్ ప్రక్రియ కొత్తేమీ కాదు.. ఈ సరే ప్రత్యేకం -- పేదోడి ఓటును కాపాడితేనే రాజ్యాంగ పరిరక్షణ -- నవంబర్‌ 1న ఛలో ఢిల్లీకి తరలిరావాలి -- ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభను విజయవంతం చేద్దాం -- పట్టభద్రుల ఎమ్మెల్సీగా సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి -- మంత్ర పినపల్లో టిడిపి జోరు ఇంట్లోకి చొరబడి దాడి... ముగ్గురు నిందితులకు రిమాండ్ జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

అరాచక పాలనకు బుద్ధి చెప్పండి

Select Suryaa Now
అరాచక పాలనకు బుద్ధి చెప్పండి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరెండున్నర ఏళ్లలో హామీ లు గాలికి వదిలి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు 

కోరుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో సోమవారం పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే గొప్ప పాలన అందిస్తామంటూ గొప్పలు చెప్పి ఊరువాడ కూటమి నేతలు ప్రచారం చేస్తారు.

రెండున్నర ఏళ్లకాలంలో  అభివృద్ధిని హామీలను గాలికి వదిలేసి అవినీతి లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్నారు. రాజానగరం నియోజక వర్గాన్ని డ్రగ్స్ ,గంజాయి, క్రికెట్ బెట్టింగులు ,బెల్ట్ షాపులు, సారా విక్రయా లు పేకాటకు క్లబ్బులకు  కేంద్రంగా మార్చార న్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ గ్రామం వెళ్లిన సచివా లయ భవనాలు హెల్త్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు, బల్క్ మిల్క్ యూనిట్లు, అభివృద్ధి చేసిన సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు కళ్ళకు కనిపిస్తాయి అన్నారు. నియోజక వర్గంలో రూ .1700 కోట్ల అభివృద్ధి సుమారు రూ.2000 కోట్ల సంక్షేమ పథకాలు ద్వారా పేదల ఖాతాలో జమ చేసామని వైయస్సార్ సిపి కార్యక ర్తలు గర్వంగా చెప్పుకో తగిన పనులు చేసామ న్నారు.కూటమి ప్రభుత్వం రెండు న్నర ఏళ్ల కాలంలో నియో జకవర్గంలో చెప్పు కోదగ్గ అభివృద్ధి పని ఒక్కటైనా చేశారని ప్రశ్నించారు. పోలీస్ వేస్తాను అడ్డు పెట్టుకుని భయానక పాలనను నడుపుతు న్నారన్నారు. ఎమ్మెల్యే రేషన్ బియ్యం అమ్ము కునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని దిగబడ్డారు.జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నక్క రాంబాబు సతీమణి రాజేశ్వరిని ఆశీర్వదించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మండలంలో అన్ని ఎంపీ టీసీ స్థానాలల్లో విజయం సాధించే దిశగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రానున్న వారం రోజులు ఎన్నికలకు సమీపిస్తానందున ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వాడికి నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉందని స్పష్టం చేశారు. మన ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే మన అభ్యర్థులను గెలిపిస్తా యన్నారు.

బుచ్చంపేట గ్రామంలో గత కొన్నిల్లుగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిందన్నారు. గెలిచే అవకాశం లేదని భావించి కూటమినేతలు వేలంపాటకు తెర లేపార న్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలు పుతున్న  కూటమి ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. స్థానిక ఎన్నిక ల్లో  ప్రతి ఒక నాయకుడు కార్యకర్త పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీ అభ్య ర్థులకు బీఫాంలో అందజేశారు.అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకు రాలు జక్కంపూడి విజయలక్ష్మి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు తోట రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు అడపా కనకరాజు, మాజీ ఏం సి చైర్మన్ నక్క రాంబాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు, గణేశుల పోసారావు, కళ్యాణి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.