BREAKING
పార్టీలకు అతీతంగా రైతాంగ శ్రేయస్సే లక్ష్యం: 'భారతీయ కిసాన్ సంఘ్' ప్రస్థానం తుఫాను ముప్పు అప్రమత్తంలో జిల్లా యంత్రాంగం ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి బెల్టు నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతాం.. ఎస్సై.. మణికంఠ..! అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ ఎంపీటీసీలకు బి-ఫారాల అందజేత... చింతలూరు నూకాలమ్మకు సప్త నది జలాలతో అభిషేకం మరోసారి అధికారం కోసమే బీజేపీ ఓట్ల తొలగింపు నాటకం -- సర్ ప్రక్రియ కొత్తేమీ కాదు.. ఈ సరే ప్రత్యేకం -- పేదోడి ఓటును కాపాడితేనే రాజ్యాంగ పరిరక్షణ -- నవంబర్‌ 1న ఛలో ఢిల్లీకి తరలిరావాలి -- ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభను విజయవంతం చేద్దాం -- పట్టభద్రుల ఎమ్మెల్సీగా సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి -- మంత్ర పినపల్లో టిడిపి జోరు ఇంట్లోకి చొరబడి దాడి... ముగ్గురు నిందితులకు రిమాండ్ జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి

చోరీ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ - బంగారు,వెండి వస్తువులు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం

Select Suryaa Now
చోరీ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ - బంగారు,వెండి వస్తువులు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం

ముదినేపల్లి,మేజర్ న్యూస్ : ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజానగరం గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి,ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు,వెండి వస్తువులతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మద్యాహ్నం 3 గంటలకుముదినేపల్లి–గుడివాడ రోడ్డులోని పౌల్ రాజ్ డ్రెయిన్ వద్ద ఎస్‌.ఐ. టి. సూర్య శ్రీనివాస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో రెండు మోటార్ సైకిళ్లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి వెనక్కి తిరిగి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో రాజానగరం గ్రామంలోని ఒక ఇంటి గేటుకు తాళం వేసి ఉండటాన్ని గమనించి,ఇంట్లో ఎవరూ లేరని భావించి నిందితులు ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్లు, తలుపుల తాళం,బీరువాను పగలగొట్టి బంగారు, వెండి వస్తువులతో పాటు రూ.10వేలు నగదును దొంగిలించినట్లు వెల్లడైంది. నిందితులు చల్లా మణికంఠ,జగనన్న కాలనీ (టిడ్కో కాలనీ ), బొమ్ములూరు గ్రామం, గుడివాడ మండలం. ( గతంలో 11 కేసులలో ముద్దాయి),కురగంటి సుభాష్ ఎ బన్నీ, నాగులేరు గట్టు, పామర్రు విలేజ్,మండలం, ( గతంలో 4 కేసులలో ముద్దాయి),పప్పుల ప్రభు కుమార్,కాలహస్త కాలనీ, మల్లాయపాలెం గ్రామం, గుడివాడ మండలం. ( గతంలో 6 కేసులలో ముద్దాయి),దొంగ సాక్షి వెంకట గణేష్,పోలుకొండ గ్రామం, నందివాడ మండలం, ప్రస్తుతం ద్రోణాదుల వారి వీధి, సెవెంత్ వార్డ్, గుడివాడ ( గతంలో 11 కేసులలో ముద్దాయి),చల్లా శ్రీనివాసరావు, కాకర్ల వీధి, గుడివాడ, గుడివాడ మండలం అను వారికి ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున పంచుకున్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

 టోల అని గుర్తింపు ఉన్న బంగారు బిస్కెట్  11.670 గ్రాములు.5 గ్రాముల అని గుర్తింపు ఉన్న రెండు చిన్న బంగారు బిస్కెట్లు  ఒక్కొక్కటి 5 గ్రాములు.2 గ్రాములు అని గుర్తింపు ఉన్న బంగారు లక్ష్మీ బిళ్ల.వెండి గ్లాసులు – 3.

వెండి పసుపు,కుంకుమ,గంధపు గిన్నెల సెట్లు – 2.వెండి కుంకుమ భరిణీలు – 2.వెండి గిన్నెలు – 2.వెండి దీపారాధన కుందులు – 2.వెండి గంధపు గిన్నె – 1.వెండి చిన్న ప్లేటు – 1.వెండి గంట – 1.

స్వాధీనం చేసుకున్న వాహనాలు

నీలం రంగు యమహా R

ఆర్ 15 మోటార్ సైకిల్.

ఎరుపు రంగు సుజుకి యాక్సెస్ మోటార్ సైకిల్ నంబరు ఏపీ 16 ఇ ఎ 3744.

ఈ కేసులో చల్లా మణికంఠ, కురగంటి సుభాష్, పుప్పల ప్రభు కుమార్, దొంగ సాక్షి వెంకట గణేష్, చల్లా శ్రీనివాసరావు అనే ఐదుగురు నిందితులను గుర్తించి, వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. జిల్లా ఎస్ పి కొమ్ము . ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ  డి . శ్రావణ్ కుమార్ ఆద్వర్యం లో కైకలూరు రూరల్ సి ఐ వి. రవి కుమార్,ముదినేపల్లి ఎస్ ఐ టి.సూర్య శ్రీనివాస్, స్టేషన్ సిబ్బంది బి.పెద్దిరాజు ,బి. నాగబాబు,పి. పవన్ కుమార్,జి. శివ కోటయ్య,ఈ కేసును ఛేదించడంలో  ప్రతిబ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అబినందించారు.