BREAKING
వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

Select Suryaa Now
ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి      కలెక్టర్ ఇలా త్రిపాఠి
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, మున్సిపల్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్లతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, పెండింగ్ అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడం, కొంతమంది ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్, ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు అయి ఉండాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు అవగాహన సదస్సులలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.