BREAKING
వైసీపీ ఎంపీటీసీలకు బి-ఫారాల అందజేత... చింతలూరు నూకాలమ్మకు సప్త నది జలాలతో అభిషేకం మరోసారి అధికారం కోసమే బీజేపీ ఓట్ల తొలగింపు నాటకం -- సర్ ప్రక్రియ కొత్తేమీ కాదు.. ఈ సరే ప్రత్యేకం -- పేదోడి ఓటును కాపాడితేనే రాజ్యాంగ పరిరక్షణ -- నవంబర్‌ 1న ఛలో ఢిల్లీకి తరలిరావాలి -- ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభను విజయవంతం చేద్దాం -- పట్టభద్రుల ఎమ్మెల్సీగా సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి -- మంత్ర పినపల్లో టిడిపి జోరు ఇంట్లోకి చొరబడి దాడి... ముగ్గురు నిందితులకు రిమాండ్ జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తుఫాను ప్రభావం పై అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి తుఫాను ముందస్తు చర్యలపై సూచనలు

రైతులు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
రైతులు అప్రమత్తంగా ఉండాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆర్నాబ్ తుఫాను ప్రభావంతో ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బిక్కవోలు మండలంలోని వరి సాగు రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి జి. వాణి సూచించారు. తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు.

కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువలు, బోదెలను శుభ్రపరిచి, పొలాల్లోని నీటిని పూర్తిగా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేందుకు అవసరమైన మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

తుఫాను ప్రభావం ఉండే నాలుగు రోజుల పాటు, అంటే ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు వరి కోతలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పొలాల్లోని నీరు నిలిచే ప్రాంతాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచరాదని స్పష్టం చేశారు.

దాళ్వా సాగు కోసం విత్తన ధాన్యంగా ఉపయోగించేందుకు ఉంచిన ధాన్యాన్ని తేమ తగలకుండా సురక్షిత ప్రదేశంలో భద్రపరచుకోవాలని తెలిపారు. తుఫాను ప్రభావం ఉన్న సమయంలో నాలుగు రోజుల పాటు పురుగుమందుల పిచికారీకి దూరంగా ఉండాలని సూచించారు.

తుఫాను ప్రభావం తగ్గిన అనంతరం పొలాల్లో నిలిచిన నీటిని బయటకు తొలగించి, పంట పరిస్థితిని పరిశీలించిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి జి. వాణి రైతులకు విజ్ఞప్తి చేశారు.