BREAKING
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ ఎంపీటీసీలకు బి-ఫారాల అందజేత... చింతలూరు నూకాలమ్మకు సప్త నది జలాలతో అభిషేకం మరోసారి అధికారం కోసమే బీజేపీ ఓట్ల తొలగింపు నాటకం -- సర్ ప్రక్రియ కొత్తేమీ కాదు.. ఈ సరే ప్రత్యేకం -- పేదోడి ఓటును కాపాడితేనే రాజ్యాంగ పరిరక్షణ -- నవంబర్‌ 1న ఛలో ఢిల్లీకి తరలిరావాలి -- ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభను విజయవంతం చేద్దాం -- పట్టభద్రుల ఎమ్మెల్సీగా సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి -- మంత్ర పినపల్లో టిడిపి జోరు ఇంట్లోకి చొరబడి దాడి... ముగ్గురు నిందితులకు రిమాండ్ జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

Select Suryaa Now
ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంఆళ్లగడ్డ మండలం శాఖా ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు సోమవారం జరిగాయి . జిల్లా గౌరవ అధ్యక్షులు  వి.సుధాకర్ రావు  వాల్మీకి మహర్షి  చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా పూజించడం  జరిగింది. వారు మాట్లాడుతూ శ్రీమద్రామాయణ కావ్యాన్ని రచించి ప్రపంచ మానవాళికి ఆదర్శ పురుషుడైన శ్రీరాముని జీవితాన్ని అద్భుతమైన కావ్యంగా మలిచిన ఋషి అని తెలిపారు . మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రక్షించుకోవడం కొరకు ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న శ్రీ విప్రనారాయణచారి  ,విభాగ్ బౌద్దిక్ ప్రముఖ్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణమును రచించి ఉండకపోతే ప్రపంచము మానవాళికి మార్గదర్శనం లభించి ఉండకపోయేది.వాల్మీకి రచించిన రామాయణం మనకు ఆదర్శం.నేటి యువతకు రామాయణం లోని ప్రతి పాత్ర ఆదర్శం అని తెలిపారు.పక్షి, ఉడుతలకు కూడా మోక్షమును ప్రసాదించిన శ్రీరాముని జీవితము మనకు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీపతి గారు మాట్లాడుతూ విలువలు అంతరించి పోతున్న నేటి తరంలో అన్నదమ్ముల మధ్య సంబంధం,భర్త, భార్య లమధ్య సంబంధములు బలహీనపడుతూ ఉన్నాయని ,వాటిని బలోపేతం కొరకు మనము కృషి చేయాలి అని చెప్పారు. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి,14 సంవత్సరాల అరణ్యవాసము గడిపినా శ్రీరాముని ధర్మమార్గం మనకు ఆదర్శము అని తెలిపారు మండల కార్యదర్శి  బుచ్చిబాబు  గంగాధర్ , కృష్ణారెడ్డి , శ్రీనివాసరెడ్డి, రామనాథ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.