రాయికోడ్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
రాయికోడ్;నల్లంపల్లి,మహ్మదాపూర్,పిడ్ప పల్లి,కర్చల్,హుస్నాబాద్,కుస్నూర్,ఇటికేపల్లి,జాంబేగీ తదితర గ్రామాలలో పవిత్ర కావ్యం రామాయణాన్ని రచించిన
ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి ని పురస్కరించుకుని సోమవారం నాడు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేసి మహర్షి వాల్మీకి చిత్రపటాలకు,విగ్రహాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించి జయంతి వేడుకలను ఘనంగా చేయడం జరిగింది.మండల కేంద్రమైన రాయికోడ్ లో మహర్షి వాల్మీకి విగ్రహానికి పూజలు చేసి పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించి మహా హారతి ఇచ్చిన అనంతరం ఉత్సవ నిర్వాహకులు అన్నప్రసాదా వితరణ గావించారు.ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి రచించిన పవిత్ర కావ్యం రామాయణాన్ని,రాముడిని ఆదర్శంగా తీసుకుని ధర్మం బాటలో నడవాలని పలువురు పెద్దలు సూచించారు.