BREAKING
చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్ ఓటీటీని అలరిస్తున్న వినూత్న టైమ్ లూప్ చిత్రం ధూమకేతు.. తొలిరోజే వరుడికి ఊహించని షాక్ ఎంసీపల్లి ఎంపీటీసీగా రాధాకృష్ణ ఏకగ్రీవం!! రైతులు అప్రమత్తంగా ఉండాలి

*ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం*

Select Suryaa Now
*ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం*

కోహిర్;సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదికవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సంస్కృతి, సాహిత్యానికి అపారమైన సేవలందించిన మహర్షి వాల్మీకి జీవిత విశేషాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన రచనలు మానవతా విలువలు, ధర్మం, సత్యం, నైతికతను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి చూపిన మార్గం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల తహసీల్దార్ సుప్రియ, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అశ్విన్, సర్వేయర్ నర్సింలు, సీనియర్ అసిస్టెంట్ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ నాగరాణితో పాటు జీపీఆర్ఓలు ఖాదర్, సతీష్, యాదగిరి, మల్లేశ్వరి, శ్రీనివాస్ తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.