BREAKING
అంగన్‌వాడిలో ఏడుగురే.. హాజరులో 14మంది - తనిఖీలో వెలుగుచూసిన వ్యత్యాసం హస్నాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలాల్ నరసింహ గౌడ్ ఎన్నిక IND vs NZ: భారత్ A తరఫున జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ.. రిషభ్ పంత్ ఫిట్‌నెస్ టెస్ట్! దుద్యాల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనన్ రామగిరి ఖిల్లాలో 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసిన ఎంపీ వంశీకృష్ణ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి అతిథిగా ఘనంగా "చంద్రయాన్" సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్ అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి రేపటి నుంచి స్కూల్స్ కి సెలవు..! ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు ప్రారంభించిన కేటీఆర్ దోమడుగు శివారులో రోడ్డు ప్రమాదం ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా...? ఆదర్శవంతమైన డివిజన్ లక్ష్యంగా కృషి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ ఎస్‌ఐఆర్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలి ... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి "శనార్తి" షూటింగ్ ను సందర్శించిన సిపి ఎమ్మెల్యే సత్యం. నిజాయితీతోనే సమృద్ధి...అవినీతికి చరమగీతం పాడాలి

సీతారాంపల్లిలో దొంగల బీభత్సం..

Select Suryaa Now
సీతారాంపల్లిలో దొంగల బీభత్సం..

సిద్దిపేట రూరల్,మేజర్ న్యూస్: రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. బంగారం, వెండి ఆభరణాలను అపహరించుకెళ్లారు.రూరల్ ఎస్సై డి. నవత తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోచంపల్లి స్వామి తన భార్య ప్రత్యూషతో కలిసి కుటుంబ అవసరాల నిమిత్తం మహారాష్ట్రలోని లిక్కర్ డిపో వద్దకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగులగొట్టి ఒక తులం బంగారు గొలుసు, ఏడు గ్రాముల బరువున్న చిన్న బంగారు ఉంగరాలు, పది తులాల వెండి కడియాలను ఎత్తుకెళ్లారు.
అదేవిధంగా గ్రామానికి చెందిన జీర్కపల్లి లింగం, జీర్కపల్లి మల్లయ్య ఇళ్లలోనూ తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. అక్కడ ఎలాంటి వస్తువులు లభించకపోవడంతో వెనుదిరిగారు. బాధితురాలు ప్రత్యూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవత తెలిపారు.

(సూర్య రూరల్, రమేష్)