BREAKING
కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్

*ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ*

Select Suryaa Now
*ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ*

జహీరాబాద్;జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి డా. ఏ. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ‘ఓట్ బచావ్‌–దేశ్ బచావ్‌’ హక్కుల పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పరిశీలకులు సరల్ పటేల్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ (SIR) సర్వే నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినట్లు గుర్తించిన ఓట్ల అంశంపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయడం, అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఓటు హక్కుల పరిరక్షణ కోసం తమ నిరసన గళాన్ని వినిపించేందుకు నవంబర్ 1న దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో-ఆర్డినేటర్ మహమ్మద్ గౌస్, ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, సువర్ణ మల్లన్న పాటిల్, పవన్ రాథోడ్, ఉదయ్ శంకర్ పాటిల్, కోహిర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముజఫర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్షద్ అలీ, సామెల్, మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మక్సూద్ అహ్మద్, మాజీ పట్టణ అధ్యక్షుడు కండేం నర్సింలు, శంషీర్ అలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, కౌన్సిలర్ మహేష్ కుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.