దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు డివిజన్ పరిధిలో దీపావళి పండుగ సందర్భముగా నూతన తాత్కాలిక బాణసంచా (పటాకుల) దుకాణాల ఏర్పాటుకు, అలాగే పాత లైసెన్సుల నవీకరణ (రెన్యువల్ ) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఆసక్తి గల వ్యాపారులు క్రింది విధివిధానాలను పాటించవలసిందిగా కోరడమైనది:1. దరఖాస్తు స్వీకరణ వివరాలు: చివరి తేదీ: అక్టోబర్ 27,స్వీకరించే ప్రదేశం: ఆర్.డి.ఓ. కార్యాలయం, నెల్లూరు,సమయం: ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే. సంబంధిత అధికారి: దరఖాస్తులను కార్యాలయంలోని 'మంజుల' (సంబంధిత సెక్షన్) కి సమర్పించాలి.మైదానం నమూనా వివరాలు: దరఖాస్తుదారులు తాము ఏ మైదానం (గ్రౌండ్ ) కొరకు లైసెన్సు దరఖాస్తు చేసుకుంటున్నారో దరఖాస్తు ఫారమ్‌లో స్పష్టంగా పేర్కొనవలెను.2. లైసెన్సు నిబంధనలు మరియు ప్రక్రియ:నూతన దరఖాస్తుదారులు: దరఖాస్తు సమర్పించిన అనంతరం, ఆర్.డి.ఓ. కార్యాలయం నుండి పోలీసు మరియు అగ్నిమాపక (ఫైర్ ) శాఖలకు పరిశీలన నిమిత్తం లేఖలు పంపబడతాయి.ఆన్‌లైన్ ఫైర్ ఎన్ ఓ సి దరఖాస్తు: ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులందరూ అగ్నిమాపక శాఖ ఎన్ ఓ సి కొరకు తప్పనిసరిగా ఆన్‌లైన్ (ఆన్లైన్ ) విధానంలో జిల్లా అగ్నిమాపక అధికారి (డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ) కి దరఖాస్తు చేసుకోవాలి.జీఎస్‌టీ చెల్లింపు: వ్యాపారులు తప్పనిసరిగా జీఎస్‌టీ శాఖకు వర్తించే రుసుమును చెల్లించి రసీదు పొందాలి.నవీకరణ (రెన్యువల్ ) దరఖాస్తుదారులు: పాత లైసెన్సుదారులు నవీకరణ కోసం తప్పనిసరిగా ఫైర్ ఎన్ఓసి (ఆన్‌లైన్ ద్వారా పొందినది) మరియు జీఎస్‌టీ చెల్లింపు రసీదులను సమర్పించాలి,3. డిప్ / లాటరీ నిబంధనలు:అర్హత: అక్టోబర్ 27 లోపు దరఖాస్తు సమర్పించి, పోలీసు & అగ్నిమాపక శాఖల ఎన్ ఓ సి లు పొంది, జీఎస్‌టీ చెల్లించి అసలు జీఎస్‌టీ రసీదులను సమర్పించిన వారు మాత్రమే డిప్/లాటరీలో పాల్గొనేందుకు అనుమతించబడతారు.పారదర్శకత: బాణసంచా దుకాణాల కోసం కేటాయించిన అన్ని మైదానాలకు (గ్రౌండ్స్ ) సంబంధించి డిప్/లాటరీ ప్రక్రియ సంపూర్ణ పారదర్శకంగా నిర్వహించబడుతుంది. సిఫార్సులకు తావు లేదు: దరఖాస్తులు లేదా కేటాయింపులకు సంబంధించి ఎటువంటి ఒత్తిళ్లు, విజ్ఞప్తులు లేదా సిఫార్సులు (రికామెండేషన్స్ ) స్వీకరించబడవు,4. డిప్/లాటరీ నిర్వహణ సమయం:
అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖల ఎన్ ఓ సి లు మరియు జీఎస్‌టీ రసీదులు పూర్తిస్థాయిలో అందడమే ఆలస్యం, వెంటనే డిప్/లాటరీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన తేదీ మరియు సమయాన్ని త్వరలోనే తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు.