BREAKING
శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ జిల్లా పరిషత్ పాఠశాలకు టేబుల్ బహుకరించిన ఐటీసీ.. షెడ్యూల్‌ కంటే ముందే న్యూజిలాండ్‌కు చేరుకున్న శుభమన్ గిల్.. కఠోర సాధనలో నిమగ్నమైన స్టార్ బ్యాటర్ పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

*ఉచిత కుటుంబ సలహా కేంద్రం జెండర్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.పి సంజీవరెడ్డి*

Select Suryaa Now
*ఉచిత కుటుంబ సలహా కేంద్రం జెండర్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.పి సంజీవరెడ్డి*

నారాయణఖేడ్; నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో, కమ్యూనిటీ నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత కుటుంబ సలహా కేంద్రం మరియు జెండర్ రిసోర్స్ సెంటర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ... మారుతున్న కాలంలో చిన్న చిన్న మనస్పర్థలతో కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా, నిపుణులైన కౌన్సెలర్ల ద్వారా ఉచితంగా సలహాలు, సూచనలు అందించడం అభినందనీయమన్నారు.  మహిళల హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వం, కుటుంబాల్లో సామరస్యం పెంపొందించడానికి ఈ కేంద్రం ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లకుండా గ్రామీణ మహిళలు, దంపతులు స్థానికంగానే పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.సమాజంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పేదరిక నిర్మూలనతో పాటు వారి సామాజిక భద్రతకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఏపిఎం సాయిలు, నర్సింలు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు సిసిఎస్, మండల సమాఖ్య ప్రతినిధులు, వీవోఏలు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు