హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి
పలమనేరులో స్ట్రాంగ్ రూములు, కౌం
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:పలమనేరు డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి సోమవారం పరిశీలించారు. పలమనేరు పట్టణ మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ హాళ్లలో చేపట్టాల్సిన సదుపాయాలు, ఎన్నికల సామగ్రి భద్రపరిచే విధానాన్ని అధికారులు పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అలాగే పలమనేరు డిగ్రీ కళాశాలలో స్థానిక సంస్థల ఎన్నికల విధులకు సహకరించిన ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్ విద్యార్థులను కలెక్టర్, ఎస్పీ అభినందించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగేందుకు యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, పలమనేరు అర్బన్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి, ఆర్డీఓ భవాని, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరు రిపోర్టర్ అజయ్ కుమార్