andhrapradesh
టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపల్ చైర్మన్‌గా కూటమి బలపరుస్తున్న టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగులు ఘనంగా సంఘీభావం తెలిపారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని పోతురాజు గండిలో ఉన్న నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు అశోక్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించారు. అద్దంకి అభివృద్ధిలో విశ్రాంత ఉద్యోగుల అనుభవాలు సలహాలు సూచనలు ఎంతో అవసరమని అశోక్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అద్దంకి పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, నర్రా గోపాల రావు, మల్లాది శ్రీనివాసరావు, వారణాసి రఘురామ శర్మ, చిన గురవయ్య తదితరులు పాల్గొన్నారు.