నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి * ఎమ్మెల్సీ సురేష్ బాబు *
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించి, పట్టణ అభివృద్ధికి పట్టం కట్టాలని శాసనమండలి సభ్యులు సురేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నెల్లిమర్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం, పట్టణ సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. వైఎస్ఆర్సిపి ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా నెల్లిమర్లలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని విజ్ఞప్తి చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ అండగా నిలవాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి కార్మిక విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ధవళ లక్ష్మణరావు, కౌన్సిలర్ అభ్యర్థులు బూర సత్తిబాబు, కారుకొండ కృష్ణ, మొంగం అశోక్ పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.